- మార్చి వినిపించిన న్యూరాలింక్ సాఫ్ట్‌వేర్
- క్లినికల్ ట్రయల్స్‌లో భార్యకు ‘ఐ లవ్ యూ’ చెప్పిన బాధితుడు
వాషింగ్టన్: నాడీ సంబంధిత వ్యాధుల కారణంగా మాట్లాడే శక్తిని కోల్పోయిన బాధితుడికి ఎలాన్ మస్క్‌కు చెందిన ‘న్యూరాలింక్’ కంపెనీ గొంతుకగా మారింది. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్) కారణంగా కొంతకాలంగా మాట్లాడలేకపోతున్న వ్యక్తితో మళ్లీ మాట్లాడించింది. ఆలోచనలు స్పష్టంగానే ఉన్నప్పటికీ, నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల బాధితులు ఆ భావాలను పెదవులపైకి తీసుకురాలేకపోతారు. దీంతో మెదడులోని ఆలోచనలను బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా గ్రహించి వాటిని శబ్దాలుగా మార్చి వినిపించింది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ వీడియోలో బాధితుడు ఆలోచనల ద్వారా తన భార్యకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పారు.
